logo

గంటేడ గౌరునాయుడు రచన పాడుదమా స్వేచ్చాగీతం పుస్తక ఆవిష్కరణ


సాహిత్యం కళలను ప్రోత్సహిస్తాం మజ్జి శ్రీనివాసరావు

గంటేడ రాసిన పాడుదమా స్వేచ్ఛా గీతం పుస్తకావిష్కరణ సభ

విజయనగరం, ఏప్రిల్ 27 :
సాహిత్య కళలకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తానని జిల్లా పరిషత్ చైర్
పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం కళలకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. గురజాడ, ద్వారం, ఘంటసాల, సుశీల లాంటి ఉద్దండులు నడయాడిన ఈ నేల ఎంతో ప్రశస్తమైనదని కొనియాడారు.

ప్రముఖ కవి గంటేడ గౌరు నాయుడు రాసిన పాడుదమా స్వేచ్ఛా గీతం పుస్తకాన్ని, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్
మజ్జి శ్రీనివాస రావు ( చిన్న శ్రీను)
మాట్లాడుతూ సాహిత్యాన్ని కళలను భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత అందరీ పైనా ఉందన్నారు. తమవంతుగా వీటిని నిరంతరం ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని హామీ ఇచ్చారు. గంటేడ గౌరునాయుడు
రాసిన పుస్తకాన్ని జిల్లా పరిషత్ పాఠశాలల్లో, గ్రంథాలయాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఉత్తరాంధ్ర కవులు కళాకారులకు సముచిత గౌరవాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సాహితీ స్రవంతి నిర్వాహకులు చీకటి దివాకర్, చంద్రికారాణి ఆధ్వర్యంలో వారి కుమారుడు రవితేజ, కోడలు వైష్ణవి మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వినూత్నంగా ఈ సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, కవి డాక్టర్ డి వి జి శంకర్రావు, ప్రముఖ కవులు గంటేడ గౌరునాయుడు, అట్టాడ అప్పలనాయుడు, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, ప్రముఖ వైద్యులు డాక్టర్ గేదెల సన్యాసమ్మ, పలువురు కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

1
767 views