తెలుగు భాష అంతర్జాతీయ సదస్సుకు కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజుకు ఆహ్వానం
తేదీ,29-04-2025:శేరిలింగంపల్లి, చందానగర్: తెలుగు భాషా చైతన్య సమితి 12వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని, "తెలుగు భాషకు పట్టాభిషేకం" పేర 'తెలుగు భాష అంతర్జాతీయ సదస్సు' నిర్వహించుట జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖులైన కవి పండిత కళాకారుల సమ్మేళనం నిర్వహించబడుతుంది.ఈ సదస్సు సికింద్రాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గాన సభలో తేదీ: 08-05-2025న జరుగును.ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనం నందు పాల్గొనవలసిందిగా ప్రముఖ కవి, పండితులు కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజుకు, తెలుగు భాష చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పి.బడే సాబ్, సమన్వయకర్త డాక్టర్ వి. జయప్రకాష్ గారు ఆహ్వానం పంపారు. ఈ సదస్సు నందు "తెలుగు భాష వైభవం" అనే శీర్షికన తన కవితను వినిపించడానికి కౌండిన్యశ్రీ నండూరి వారు సదస్సుకు ఎంపిక కావడం చాలా ముదావహంగా ఉందని, నగరానికి చెందిన వివిధ సాంఘిక, సాంస్కృతిక, ధార్మిక, కళా సంస్థల ప్రతినిధులు కొనియాడారు. ఆయన చేస్తున్న సాహిత్య సేవలకు ప్రశంసలు తెలియజేశారు.