logo

అత్యద్భుతంగా సాగిన "స్వర బృందావనం" 16 వ సంగీత విభావరి. 28.04.2025

28.04.2025 న సిటీ కల్చరల్ సెంటర్ హైదరాబాద్ లో శ్రీ రవికాంత్ శ్రీ కుమార్ ల రథ సారథ్యంలో "స్వర బృందావనం" 16 వ సంగీత విభావరి అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడినది.
"స్వర బృందావనం" ప్రత్యేకత ఏమిటంటే గాయనీ గాయకులకు ఎక్కువ పాటలు పాడే అవకాశం ఇవ్వడమే కాక "అతిథి సత్కారం" కూడా అంతే బాగా ఉంటుంది. అందుకే గాయనీ గాయకులందరు స్వర బృందావనాన్ని ఆస్వాదిస్తూ పాటలు పాడడానికి ఉత్సాహం చూపిస్తారు.
ఈ 16 వ సంగీత విభావరి ఉదయం 9.30 గంటలకు శ్రీ రవికాంత్ గారి వినాయక ప్రార్ధన తో శుభారంభం గావింపబడినది. పిమ్మట శ్రీ కుమార్ "లింగాష్టకం" పఠించి ఈశ్వరుని, సీతాకుమారి శైలజ లు "శ్రీరాముని చరితము ను" అంటూ శ్రీరాముని, రవికాంత్ "ఏకదంతాయ" అంటూ వినాయకుని, శ్రీమణి సమీర లు "శ్రీ సూర్యనారాయణా" అంటూ సూర్యనారాయణ స్వామిని కనులముందు సాక్షాత్కరింప జేశారు.
అనంతరం రవికాంత్ శైలజ లు "మేఘమా మరువకే" అంటూ అలరించారు, శ్రీ కుమార్ లక్ష్మి లు "చిరునవ్వుల తొలకరి లో" అంటూ తొలకరిని రప్పించారు. పిమ్మట రవికాంత్ సమీర లు "అయ్ మేరే హంసపర్" అంటూ రాగాలాపన చేస్తే, శ్రీమణి మరో హిందీ పాట తో అలరించారు.
ఈవిధంగా గాయనీ గాయకులందరు పోటాపోటీగా సాయంత్రం 4 గంటల వరకు వివిధ రకాల గీతాలు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యుగళ గీతాలు, సోలో గీతాలు, పురుషుల యుగళాలు, మహిళల యుగళాలు మొదలైన విభిన్న వ్యత్యాసాలతో కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడినది.
ఈ కార్యక్రమం లో శ్రీయుతులు రవికాంత్, శ్రీ కుమార్, రాంబాబు, వెంకట ప్రసాద్ ప్రభృతులు, శ్రీమతులు సీతాకుమారి, శైలజ, లక్ష్మి, సమీర, యశోద, శ్రీమణి ప్రభృతులు మిక్కిలి మక్కువ తో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
చివరగా రవికాంత్ కాశ్మీర్ దుర్ఘటన కు చింతిస్తూ, దుర్మార్గులను శిక్షించే భారత సైనికులకు అంకితం చేస్తూ "ఒకడే ఒక్కడు మొనగాడు" పాటను ఆలపించారు. కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

106
4768 views