logo

నేడే సింహాచలం వరాహ నరసింహ దేవస్థానం చందానోత్సవం.. పెరిగిగిన భక్తులు రద్దీ..!!!

AIMA MEDIA :ఏప్రిల్ 28:బుధవారం :వైజాగ్
న్యూస్ 9:-*- నేడు సింహగిరిపై చందనోత్సవం*

విశాఖపట్నం(సింహాచలం):

వైశాఖ శుద్ధతదియ పర్వదినాన బుధవారం సింహాద్రి అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనయాత్ర వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరిగాయి. రేపు వేకువజామున 1 గంటకు సుప్రభాత సేవ, విష్వక్సేన ఆరాధన, చందన తొలగింపు, నిజరూప ఆరాధన జరుగుతాయి. 3గంటలకు ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబానికి తొలిదర్శనం, 4గంటల నుంచి సర్వదర్శనం కల్పిస్తారు. రాత్రి 9గంటలకు సహస్ర ఘటాభిషేకం, 11గంటలకు చందన సమర్పణతో చందనోత్సవం సమాప్తమవుతుంది..అని ఆలయం కార్య నిర్వహణ అధికారులు తెలిపారు.

15
5131 views