logo

శారీరక వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి సీతక్క * వైకల్యం శరీరానికి మాత్రమే మనసుకు కాదు...

*తెలంగాణ స్టేట్*** ములుగు జిల్లా*
+మే 0 1)

శారీరక వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి సీతక్క ...

* వైకల్యం శరీరానికి మాత్రమే మనసుకు కాదు...

* వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి...

తేది: 01.05.2025 గురువారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో సి.డి.పి.ఓ. శిరీష ఆధ్వర్యంలో వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మంత్రి దనసరి (అనసూయ) సీతక్క విచ్చేసి శారీరక వికలాంగులు అయిన బాలాజీనగర్ గ్రామానికి చెందిన భూక్యా శిల్ప మరియు ఎల్బి నగర్ గ్రామానికి చెందిన కబ్బక లక్ష్మయ్య వీరు ఇరువురికి బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి , గోవిందరావుపేట మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

30
1956 views