మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదములు తెలిపిన డి. శ్రీకాంత్
యస్.టి.డి. న్యూస్: వైసిపి పార్టీ అధినేత YS జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ST విభాగ కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట గ్రామ మాజీ వాలంటీర్ D. శ్రీకాంత్ ను నియమిస్తున్నట్లు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డి శ్రీకాంత్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరియు సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి ఈ పదవి నాకు ఇచ్చినందుకు 2029 లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తానని తెలిపారు.