
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో..సమతా మూర్తి రామానుజుల వారి 1008వ తిరు నక్షత్ర వేడుకలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్
హైదరాబాద్ (తొర్రూరు) మే 2 (AIMEDIA)
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో..సమతా మూర్తి రామానుజుల వారి 1008వ తిరు నక్షత్ర వేడుకలు కనుల పండుగ లా జరిగాయి.
ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ పాల్గొని మాట్లాడుతు
సమాజంలో అసమానతలు లేని వ్యవస్థ చూడాలని , మనుషుల మధ్య కులాల గోడలు అడ్డుగా ఉండరాదని సమానత్వాన్ని చాటిన గొప్ప స్వామి రామానుజులవారు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వెల్లడించారు.సమతా మూర్తి రామానుజుల వారి 1008వ తిరు నక్షత్రం సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిలో జరిగిన సమత మూర్తి తిరు నక్షత్ర వేడుకలలో స్వామి వారు రామానూజుల వారి స్వర్ణ మూర్తి కి విశేష పూజ కార్యక్రమాలు చేసి ప్రసాద వినియోగం చేశారు అనంతరం వికాస తరంగిణి వరంగల్ శాఖ అధ్యక్షులు డాక్టర్ బచ్చు రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భజన మండళ్ళకు , కోలాట బృందాలకు రాష్ట్రస్థాయిలో సంకీర్తన మండలి పేరుతో పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30వ బృందాలు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి నగదు ప్రోత్సాహకాలను, కళాకారులందరికి ప్రశంస పత్రాలను స్వయంగా స్వామివారు అందజేసి అభినందించారు. ప్రముఖ పేరెడీ కవి జొన్నవిత్తుల రామేశ్వరరావు తనదైన శైలిలో సమతా మూర్తి, జీయర్ స్వామిల సేవాలనుకునే ఆడుతూ కవిత గానం చేశారు అనంతరం జంట నగరాలలో ఉన్న వైష్ణవ ఆలయాల నుండి రామానుజుల ఆల్వార్ మూర్తులను సమతా కేంద్రంలో ఒకే చోట ఏర్పాటు జీయర్ స్వామి అహోబిలం స్వామివారు దేవనాద జీయర్ స్వామి, రామానుజుల వారి అష్టోత్తరస్తోత్రం పూజా కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులకు అనేక మంగళా శాసనంలు చేశారు. ఈ సందర్భంగా రామానుజుల వారి చరిత్ర ను కీర్తిస్తూ రూపొందించిన సిడిని ఆవిష్కరించారు. ఈ చరిత్రను ఆహోబిలం స్వామి స్వర కల్పన చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రామేశ్వరరావు జానకమ్మ, వరంగల్ వికాస తరంగిణి బాధ్యులు నరసింహారెడ్డి తనుజ,ఉమా,
కోలాట పోటీలో కార్యక్రమంలో సేవలు అందించిన కార్యకర్తలు :
సిహెచ్ అనిత ,భార్గవి ఎస్ఎస్ సుచరిత,వాణి రాజేందర్
,యాదా శ్రీనివాస్ ,పి శ్రీనివాస్
రజితా శ్రీనివాస్ ,కే .కవిత
ఏ రాణి ,భజన మండలి కార్యక్రమములో సేవలందించిన కార్యకర్తలు పద్మ వసంత ,ఈ వనజ
ఎం అరుణ రేణుక,బాజీరావు,
ఆర్ అరుణ కుమారి
శ్రీలత ,చిరంజీవి సందీప్ తదియారాధన సేవలో తిరుమల రావు మాలాని శ్రీనివాస్
ఎన్ శ్రవణ్ , శ్రీరామ్ చంద్ర రెడ్డి ,ఆది రెడ్డి ,ప్రవీణ్ ,సందీప్ తొర్రూరు వికాస తరంగిణి చైర్మన్, గీతారెడ్డి, పిఆర్ ఓ, ఇమ్మడి రాంబాబు, మంజుల భక్తులు కోలాట బృందాలు భజన మండళ్ళు, కళాకారులు బాధ్యులు పాల్గొన్నారు. కోలాట బృందం విభాగంలో మంజునాథ ,
భజన విభాగంలో నర్సంపేట రాఘవాచారి బృందాం గెలుపొందినట్లు చెప్పారు.