logo

ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎంపీడీఓ సస్పెన్షన్‌

శ్రీకాకుళం: ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎంపీడీఓ బత్తుల మల్లేశ్వరరావుని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లేశ్వరరావు 2023-24 ఆర్థిక సంవత్సరంలో టెక్కలి మండల పరిషత్‌ కార్యాలయంలో ఈవోపీఆర్‌డీగా పనిచేస్తూనే, టెక్కలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో పంచాయతీ నిధులు దుర్వినియోగంలో పాత్ర ఉందంటూ మల్లేశ్వరరావును సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం ఎచ్చెర్ల ఈవోపీఆర్‌డీగా పనిచేస్తున్న మల్లేశ్వరరావు మార్చి 10 నుంచి ఇన్‌చార్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్‌ ఎంపీడీవో సీపాన హరిహరరావు రెండు నెలల దీర్ఘకాలిక సెలవుపెట్టారు.

0
0 views