శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం : సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఎస్సై వి.సందీప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అల్లర్లు, ఘర్షణలు, కుట్రలకు పాల్పడే వారు, పాల్పడే అవకాశాలు ఉన్న వారిపై నిఘాపెట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, శక్తి యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.