logo

మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణించే సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని ఏసి బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు మే 3(AIMEDIA) తొర్రూర్ డిపో నుండి రెండు రాజధాని ఏసి బస్సులను పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యురాలు శనివారం తొర్రూర్ బస్టాండ్ ఆవరణలో ఏసి బస్సు సర్వీసులను ప్రారంభించారు . అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ఉచితంగా ప్రయాణించే మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని అన్నారు మహిళలు ఆర్థిక అభివృద్ధి కలిగించేందుకు అలాగే గృహలక్ష్మి గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఈఐసి బస్ సర్వీస్ లను ప్రయాణికులు సద్విని చేసుకోవాలని చెప్పారు.తెలంగాణ ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని,ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు,హైటెక్‌ హంగులతో రూపొందించిన ప్రైవేట్‌ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను ప్రయాణికులకు సౌకర్యం కోసం సురక్షితమైన వేగవంతమైన ఏసి బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు, బస్సు సేవలను అందరు వినియోగించుకోవాలని కోరారు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిత్యం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అనంతరం డిపో మేనేజర్ వి.పద్మావతి మాట్లాడుతూ తొర్రూరు డిపో నందు రెండు ఏసీ రాజధాని బస్సులు తొర్రూర్ నుంచి వయా మోత్కూర్ ఉప్పల్ వరకు నడుపుతున్నాము. ఈ తొర్రూరు పట్టణ మరియు ప్రాంత పరిసరాలలో ఉన్న ప్రయాణికులు ప్రయాణించు టకు ఇట్టి బస్సులను అందుబా టులోకి తీసుకొస్తున్నాము అన్నారు.ప్రతి ఒక్కరు వినియోగించుకొని మా డిపో అభివృద్ధి కి తోడ్పడుతారని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం ఎఫ్ పి.విజయ్ కుమార్ ట్రాఫిక్ ఇంచార్జి ,జి.రజిత బస్టాండ్ ఎస్.ఎం,ఎస్ మల్లికార్జున్ ఆర్ ఎస్ కుమార్,
పి. మహేందర్ రెడ్డి సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్,
పట్టణ మున్సిపల్ చైర్మన్
జి.రామచంద్రయ్య కాంగ్రెస్ నాయకులు,తొర్రూరు డిపో సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాజధాని ఏ సి బస్సు సర్వీసుల సమయాలను టికెట్ ధరలను డిపో మేనేజర్ పద్మావతి తెలుపుతూ
తొర్రూర్ నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు- ఉదయం
5:20,11:00, మధ్యాహ్నం 1:00, సాయంత్రం 6:30
ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి తొర్రూర్ కు ఉదయం
6:50, 9:20, మధ్యాహ్నం 2:40, సాయంత్రం4:50 మేళలలో నడుపుతున్నట్లు చెప్పారు . ఈ రాజధాని ఏసి బస్సులో తొర్రూరు నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్డు వరకు- రూ 370లు
తొర్రూర్ నుండి తిరుమలగిరి రూ 100లు
తొర్రూరు నుండి మోత్కూర్ రూ 150 లు నిర్ణయించినట్లు చెప్పారు.

28
988 views