logo

శ్రీ చౌడేశ్వరిదేవి నూతన విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

నంద్యాల జిల్లా/బనగానపల్లె(AIMA MEDIA): బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి - బీసీ ఇందిరమ్మ దంపతులు.విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి యాగంటి పల్లెకు విచ్చేసిన మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు.శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు.అనంతరం మంత్రి కుటుంబ సభ్యులకు.. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి.. ఆశీర్వచనం అందించిన పురోహితులు.ఈ సందర్భంగా యాగంటిపల్లి గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

2
981 views