logo

రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ బంద్: పెట్టేలి దాసుబాబు

రాజకీయ లబ్ధి కోసం జివో నెం.3 పుణరుద్దరణ పై శనివారం వైసీపీ బంద్ చేయడం బాధకరంగా ఉందని పెదలబుడు సర్పంచ్ పెట్టేలి దాసుబాబు అన్నారు. అరకులోయ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిఓ నెం.3 పై బంద్ నిర్వహించే అర్హత వైసీపీ కి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జిఓ నెం.3 ని సుప్రీం కోర్టు రద్దు చేస్తే కనీసం దానిపై రివ్యూ పిటిషన్ కూడా వైసీపీ ప్రభుత్వం వేయలేదన్నారు. గిరిజన ప్రాంత ఉద్యోగాలు 100% గిరిజనులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదనే నమ్మకం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం పై ఉందని దాసుబాబు అన్నారు.

0
0 views