అరకు: గ్రామ నాయకుడిని ఎన్నుకున్న సిమిలిగుడ గ్రామస్తులు
పూర్వపు ఆచార సాంప్రదాయాలలో ఒకటైన గ్రామ నాయుడు/నాయకుడిని ఎన్నుకునే పద్ధతిని గిరిజన గ్రామాలు కొనసాగిస్తున్నాయి. ఆదివారం అరకులోయ మండలం, కొత్తభల్లుగూడ పంచాయితీ, సిమిలిగుడ గ్రామంలో గ్రామ నాయకుడి గా పి సింహాద్రి, సహాయ నాయకుడు(సొల్లాన్) గా పి బాబూరావును గ్రామస్తులు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు హాజరైన మండల వైసీపీ అధ్యక్షులు స్వాభి రామూర్తి ఎన్నికైన వారిని సన్మానించి అభినందించారు.