logo

బహిరంగ ప్రదేశాలలో దూమపానం చేస్తే జరిమానా : అరకు ఎస్ఐ

బహిరంగ ప్రదేశాలలో దూమపానం చేయడం నేరమని అరకులోయ ఎస్ఐ గోపాలరావు తెలిపారు. గత వారం రోజుల్లో అరకులోయ పట్టణంలో బహీరంగ ప్రదేశాలలో దూమపానం చేస్తూ పట్టుబడిన 15 మందికి జరిమాన వేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. "సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు చట్టం, 2003" ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరం, దీనికి రూ. 200 వరకు జరిమానా విధించవచ్చని ఎస్ఐ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో దూమపానం చేస్తే దాని ప్రభావం పక్కవారిపై కూడా ఉంటుందని ఎస్ఐ అన్నారు.

0
46 views