వేంకశ్వరస్వామి ఉత్సవాలకు సిద్దమౌతున్న అరకులోయ
వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి అరకులోయ సిద్దమౌతుంది. ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగు వేంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వేంకటేశ్వర స్వామి ఆలయానికి పెయిటింగులు పూర్తిచేసి, ఆలయ ప్రాంగణంలో పందిరి వేస్తున్నారు. ప్రధాన రహదారులలో విద్యుత్ దీపాలంకరణ పనులు త్వరితంగా జరుగుతున్నాయి.