ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లో సిబ్బంది కొరత!
హైదరాబాద్, మే 4(ఆంధ్రజ్యోతి): క్లిష్టమైన క్రిమినల్ కేసుల్లో.. ఫోరెన్సిక్ విశ్లేషణ అత్యంత కీలకం..! నేరస్థులకు కోర్టుల్లో శిక్ష పడాలంటే.. పోలీసుల దర్యాప్తుతోపాటు.. ఫోరెన్సిక్ నివేదికల ప్రాముఖ్యత అంతాఇంతా కాదు..! రేప్ కేసుల్లో నిందితుల వీర్యకణాల విశ్లేషణ, డీఎన్‌ఏ పరీక్షలు.. దొంగతనాలు/దోపిడీలు, హత్య కేసుల్లో వేలిముద్రల విశ్లేషణ, తూటా ఏ తుపాకీ నుంచి వచ్చిందో గుర్తించడం, నేరం చేసేందుకు నిందితులు ఉపయోగించిన వాహనం టైరు గుర్తు దొరికినా.. చివరికి నేరస్థుల తల వెంట్రుక, ఉమ్మి, లాలాజలం లభించినా.. కేసు మిస్టరీని ఛేదించడంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎ్‌ఫఎ్‌సఎల్) పాత్ర ఎనలేనిది..! ఇంటర్నెట్‌లో వెతికి మరీ.. పోలీసులకు చిక్కకుండా ఉండేలా నిందితులు నేరాలకు పాల్పడుతుంటే.. ‘కానూన్ కా హాఁథ్ లంబా హోతాహై’ అంటూ ఎఫ్‌ఎ్‌సఎల్ బృందాలు నిరూపించిన కేసులెన్నో..! అయితే.. అంతటి కీలకమైన ఎఫ్‌ఎ్‌సఎల్‌తోపాటు.. జిల్లా ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో సిబ్బంది కొరతతో కేసులు పేరుకుపోతున్నాయి. కేంద్ర ఎఫ్‌ఎ్‌సఎల్ మొదలు.. జిల్లా స్థాయి వరకు దేశంలో మొత్తం 711 ల్యాబ్‌లు ఉండగా.. వాటిల్లో 50ు సిబ్బంది లేకపోవడం గమనార్హం..! దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లకు ఏటా 5 లక్షల దాకా కేసులు వెళ్తుండగా.. సిబ్బంది కొరత కారణంగా నివేదికల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. దేశవ్యాప్తంగా.. తెలంగాణలో 91ు, బిహార్‌లో 85ు, ఉత్తరాఖండ్‌లో 80ు మేర ఫొరెన్సిక్ సైంటిస్టుల కొరత ఉన్నట్లు ఇటీవల విడుదలైన ‘ఇండియా జస్టిస్-2025’ నివేదిక స్పష్టం చేసింది.