పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
తెలంగాణలో గత ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను జూలైలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం ఇంకా పరిష్కారం కాకపోవడంతో, దానిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై స్పష్టత రాగానే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్, ఓటరు జాబితా తయారీ, నామినేషన్ల ప్రక్రియపై ప్రకటన చేసే అవకాశం ఉంది.