logo

తెలంగాణలో సమస్యలు పరిష్కరించకపోతే మహాధర్నా:

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా, పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోవడంపై ఉద్యోగ JAC మండిపడింది. దీనికి నిరసనగా ఈనెల 15న ప్రభుత్వ కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నట్లు ప్రకటించింది. జూన్ 9న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడతామని తెలిపింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మానవహారాలు, సామూహిక భోజనాలు, పెన్ డౌన్, మూకుమ్మడి సెలవులు వంటి కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది.

0
0 views