logo

తహసీల్దార్ కార్యాలయం కు వెళ్లే రహదారిని వెడల్పు చేయండి: ప్రజాసంఘాలు డిమాండ్.

నంద్యాల జిల్లా/ పాణ్యం (AIMA MEDIA):
పాణ్యం మండలం లో తాసిల్దార్ కార్యాలయం కు వెళ్లాలంటే 30 నిమిషాలు సమయం పడుతుంది.పాణ్యం లో ప్రధాన సెంటర్ నుండి ఇస్టనుసారంగా ప్రజలు ముందుకు జరిగి ఇల్లు కట్టుకొని రహదారి కనపడకుండా చేసారు. ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ఇంక తదితరులు ఏరియా లకు ఏదైనా వాహనాలు వెళ్ళలంటే చాలా ఇరుకుగా ఉన్నవి అని తెలియజేసిన ప్రజా సంఘాలు.ప్రధానముగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయం లకు వెళ్లాలనంటే భయం వేస్తుంది.ఎక్కడ ఏ వాహనము వచ్చి తగులుతుందో అని గ్రామ పంచాయతీ అధికారులకు గతం లో తెలియచేసాము వెంటనే అదికారులు స్పందించి తాసిల్దార్ కార్యాలయం ఇంకా ముందు ఉన్న ప్రభుత్వఆఫీస్ లకు వెళ్లే రహదారులు వెడల్ప్ చేయాలని ఈ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమం లో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ కి వినతిపత్రం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమం లో ప్రజా సంఘాల నాయకులు , AIFB జిల్లా నాయకుడు వనము వేంకటాద్రి,NSUI జిల్లా నాయకుడు బత్తిని ప్రతాప్,, AIYL మండలం లీడర్ చంద్రశేఖర్, వికలాంగుల జిల్లా అధ్యక్షుడు వనము రాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

0
65 views