logo

రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పతకాలు సాధించిన భద్రాద్రి జిల్లా క్రీడాకారులు. జిల్లా జనరల్ సెక్రెటరీ జీవి రామిరెడ్డి.

హైదరాబాదులోని మేడ్చల్ లో మే 3, 4 వ తేదీలలో జరిగిన స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఎక్యిప్పడ్ పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెండు బంగారు పతకాలు మరియు ఒక రజిత పతకం సాధించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జీవి రాంరెడ్డి తెలిపారు. భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ లో పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసిన డివి శంకర్రావు గారు
మాస్టర్ 4 విభాగంలో 83 కేజీల కేటగిరీలో, స్క్వాట్ - 60 కేజీలు, బెంచ్ ప్రెస్ - 55 కేజీలు డెడ్ లిఫ్ట్ - 100 కేజీలు, మొత్తం గా 215 కేజీల బరువెత్తి బంగారు పతకాన్ని సాధించారు. మాస్టర్ 2 కేటగిరీలో 74 కేజీల విభాగం లో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కోశాధికారి అయిన మహంతి వెంకటకృష్ణాజీ రజత పతకాన్ని సాధించారు. మణుగూరుకు చెందిన
పి పాండురాజు 53 కేజీ జూనియర్ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. కాగా సిటీ స్టైల్ జిమ్ లో ప్రాక్టీస్ చేసి ఇంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా లో బంగారు పతకం సాధించిన డివి శంకర్రావు గారికి బైపాస్ సర్జరీ అయినప్పటికీ కూడా రాబోయే రాష్ట్రస్థాయి పోటీలలో బంగారు పతకం సాధించాలని ఆకాంక్షిస్తూ పాకాల దుర్గా ప్రసాద్ గారి దంపతుల నేత్రుత్వం లో, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వారు, భద్రాద్రి కళా భారతి సంఘం వారు గత ఏప్రిల్ నెలలో అభినందించి సత్కరించిన విషయం జిల్లా వాసులకు తెలిసిన విషయమే. అందరి అభినందనలు మరియు ఆశీర్వాదములతో వెళ్లిన డీవీ శంకర్రావు గారు జిల్లాకు బంగారు పతకం సాధించటం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డివి శంకర్రావు మాట్లాడుతూ తన కోచ్ జీవి రామిరెడ్డి కఠోర శిక్షణ వల్ల మరియు అసోసియేషన్ సభ్యులైన డాక్టర్ శివ రామకృష్ణ ప్రసాద్, మహంతి వెంకటకృష్ణాజి, గుగులోతు శోభ నాయక్ ల ప్రోత్సాహం తో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. ఈ గెలుపొందిన క్రీడాకారులని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి,
రాష్ట్ర ఉపాధ్యక్షులు వి మల్లేష్, తాండ్ర వెంకటరమణరావు.
పట్టణంలోని పలు క్రీడా సంఘాలు, పట్టణ ప్రముఖులు రాజకీయ నాయకులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, తదితరులు అభినందించడం జరిగింది.

5
25 views