రాజీవ్ యువ వికాసం.. సిబిల్ స్కోర్ ఉండాల్సిందే?
తెలంగాణ రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకున్న వారికి బిగ్ అలర్ట్. సిబిల్ స్కోర్ ఉన్న వారికే ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం దరఖాస్తుదారుల లోన్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇలా అయితే 40% దరఖాస్తులు తిరస్కరించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.