logo

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

భోగాపురంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన దుబ్బాక సంతోశ్‌ (35) డివైడర్‌ పక్కన ఉన్న తుప్పల్లో విగత జీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భోగాపురం ఎస్‌ఐ సూరి కుమారి ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. వేకువజామున నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీకొట్టడంతో సంతోశ్‌ మృతి చెందినట్లు ప్రథమిక నిర్ధారణలో తేలింది.

2
364 views