logo

డాక్టర్ కొప్పుల విజయకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా

డా. కొప్పుల విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్బంగా వృద్దాశ్రమంలో పండ్లు పంపిణీ
- ఎస్. జె. డబ్ల్యూ. హెచ్. ఆర్. సి సౌత్ ఇండియా వర్కింగ్ కమిటీ చైర్మన్ డా. నోముల సంపత్ గౌడ్
కరీంనగర్ : సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ మరియు ప్రముఖ న్యాయవాది, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్, బెస్ట్ ఇంటర్నేషనల్ సోషియల్ అవార్డు గ్రహిత, జీవిత సాఫల్య పురస్కార అవార్డు గ్రహీత, గ్లోబర్ అంబాసిడర్ అవార్డు గ్రహీత, సంఘ సేవకుడు, మనసున్న మహారాజు, అందరినీ ఆప్యాయంగా పలకరించే సహృదయం గల వ్యక్తి డా. కొప్పుల విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్బంగా కరీంనగర్ లోని భవిత వృద్దాశ్రమంలో పండ్లు పంపిణీ చేసి వారి మధ్యలో కేక్ కట్ ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా డా. సంపత్ గౌడ్ మాట్లాడుతూ తాము జాతీయ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్ అడుగుజాడల్లో నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నమన్నారు. ప్రతి సంవత్సరం తమ జాతీయ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలను అనాధలు, వృద్ధుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాము చేస్తున్న సామాజిక సేవా, న్యాయ కార్యక్రమాలను జాతీయ చైర్మన్ కూడా అభినందించరాని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం చైర్మన్ పి. రాజేశ్వరి తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

0
17 views