logo

India-Taliban Ties: భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ఆప్ఘన్ సై..

జైశంకర్, ముత్తాఖీ మధ్య ఫోను సంభాషణల ప్రాధాన్యతపై తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్‌ను ప్రశ్నించినప్పుడు, ఇండియాతో ఆప్ఘన్‌కు చారిత్రక సంబంధాలున్నాయని, వాటిని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కాబూల్: భారత్‌తో సంబంధాలకు పునరుద్ధరణ, పరస్పర సహకారం, పెట్టుబడులకు ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆసక్తితో ఉన్నట్టు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ (Suhail Saheen) శుక్రవారంనాడు తెలిపారు. ఇంతకుముందు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ తొలిసారి ఫోనులో సంభాషించారు. అనంతరం భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ఆసక్తితో ఉన్నట్టు సుహైల్ షహీన్ ప్రకటించారు.

115
7510 views
  
1 shares