logo

హైదరాబాద్ తార్నాక వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ను పునఃప్రారంభించిడంతో వెలువెత్తిన ట్రాఫిక్ జామ్ సమస్య.

గత పదేళ్లుగా లేని ట్రాఫిక్ సిగ్నల్స్ ను పునఃప్రారంభించిడంతో తార్నాక క్రాస్ రోడ్స్ వద్ద తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రెడ్ సిగ్నల్ కు మూడు నిమిషాలు కేటాయించి గ్రీన్ సిగ్నల్ కు కేవలం 40 సెకన్లు మాత్రమే కేటాయించడం వలన 300 నుండి 500 మీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోవడం జరిగి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూళ్లు కాలేజీలు తెరిస్తే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాల్సిందిగా వారు కోరుతున్నారు.

- తూములూరి శ్రీ కుమార్

27
794 views