logo

వ్యాపారస్తులు మున్సిపల్ నియమాలను అనుసరించాలి *మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్*

తొర్రూరు జూన్ 12(AIMEAMEDIA)
*పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం చేయవచ్చని, వ్యాపారస్తులు మున్సిపల్ నియమాలను అనుసరించి తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100రోజుల పట్టణ ప్రణాళికలో భాగంగా సి డి ఏం ఏ ఆదేశాల మేరకు కాలువలపై చెట్లు పేరుకుపోయిన డ్రైనేజీ జెసిబి సహాయంతో జంగిల్ కటింగ్ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ప్లాస్టిక్ బ్యాన్. ట్రేడ్ లైసెన్సులు మెప్మా ద్వారా అవగాహన కల్పించడం ఆక్టివిటీ చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.మున్సిపాలిటీలలో వృత్తి, వ్యాపార లైసెన్స్‌లు (ట్రేడ్ లైసెన్స్) అనేది ఏదైనా వ్యాపారం లేదా వృత్తిని నిర్వహించడానికి స్థానిక మున్సిపల్ అధికారులు జారీ చేసే అధికారిక అనుమతి పత్రం. ఇది వ్యాపారాలను క్రమబద్ధీకరించడానికి మరియు ప్రజల ఆరోగ్యం, భద్రత, పర్యావరణ పరిరక్షణను నిర్ధారించడానికి ఉద్దేశించబడింది అన్నారు
లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం అని ఇది భారీ జరిమానాలు మరియు ఇతర చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చన్నారు.
ప్రభుత్వ నియంత్రణ మున్సిపాలిటీలు వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించి, స్థానిక నియమాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని, లైసెన్సుల ద్వారా వ్యాపారాలను గుర్తించి, పన్నులు వసూలు చేయడంలో మున్సిపాలిటీలకు సహాయపడుతుందనీ,వ్యాపారాల స్వభావాన్ని బట్టి మున్సిపాలిటీలు వివిధ రకాల లైసెన్స్‌లను జారీ చేస్తాయనీ చెప్పారు . వ్యాపారాలు లైసెన్స్ పొందడం ఎలా తదితర అంశాల గురించి తెలియజేశారుసాధారణంగా ట్రేడ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అవసరమైన పత్రాలు మరియు ప్రక్రియ మున్సిపాలిటీని బట్టి అని చెప్పారు . ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే లేదా గడువు తీరిన లైసెన్స్‌తో వ్యాపారం చేస్తే భారీ జరిమానాలు విధించబడతాయని, ఈ విధంగా ఉంటాయని అన్నారు ఉదాహరణకు, తెలంగాణలో లైసెన్స్ లేని వ్యాపారాలపై వ్యాపారం ప్రారంభమైన నాటి నుంచి తొలి మూడు నెలల వరకు 25% జరిమానా, ఆ తర్వాత నుంచి లైసెన్స్ తీసుకునే వరకు 50% లైసెన్స్ ఫీజును జరిమానాగా విధిస్తారన్నారు.మున్సిపాలిటీ పరిధిలో ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ముందు, సంబంధిత మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి లేదా వారి వెబ్‌సైట్ ద్వారా లైసెన్స్ అవసరాలు మరియు ప్రక్రియ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు ఎవరైనా లైసెన్స్ తీసుకొని అర్ధాంతరంగా షాప్ ముసినట్లయితే లైసెన్సు ఫీజు చెల్లించి సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో మీ యొక్క షాప్ యొక్క పేరును ఆన్లైన్ నుండి తొలగించగలరు లేనియెడల షాపు యొక్క యజమాని నుండి ఆ పన్ను వసూలు చేయబడుతుందని అన్నారు . గురువారం పట్టణ పరిధిలో ప్లాస్టిక్ రైడ్ నిర్వహించి 5 కేజీల ప్లాస్టిక్ జప్తు చేసి 3000 రూపాయలు జరిమానా విధించామన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లు బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

0
0 views