logo

అమ్మ మాట అంగన్వాడి బాట...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలంలో 'అమ్మ మాట అంగన్వాడి బాట' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున మండలంలోని గట్టుమల్ల గ్రామపంచాయతీ, గంగమ్మ కాలనీలో అంగన్వాడి కేంద్రం నందు గ్రామంలో మూడు సంవత్సరాల నుండి పైబడిన పిల్లలను దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించాలని మరియు అంగన్వాడి కేంద్రం ద్వారా గర్భణీలకు బాలింతలకు పిల్లలకు అందించే పోషకాహారం మరియు పిల్లలకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు కథలు తెలుగు మరియు ఇంగ్లీషులో బోధన చేయడం జరుగుతుందని, 'పౌష్టికాహరం అందిస్తాం పాటలు బోధిస్తాం పిల్లలలారా రారండి అంగన్వాడీ బడులు మీవండి' అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ టీచర్ జ్యోతి, ఏ.యల్.ఎం.ఎస్.సి కమిటీ సభ్యులు, గర్భణీలు, బాలింతలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

0
90 views