logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పి.ఆర్.టి.యు-టిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన అధ్యక్షుడిగా పూనేం నరసయ్య ఎన్నిక

భద్రాద్రి కొత్తగూడెంలో పి.ఆర్.టి.యు-టిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన అధ్యక్షుడిగా పూనేం నరసయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం పి.ఆర్.టి.యు రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పూనేం నరసయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల హక్కుల కోసం అంకిత భావంతో పనిచేస్తామన్నారు. జిల్లా స్థాయిలో పి.ఆర్.టి.యు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. పి.ఆర్.టి.యు కుటుంబం అందరూ ఆయనకు అభినందనలు తెలియజేశారు.

115
5556 views

Comment