స్పోర్ట్స్ స్కూల్లో 4వ క్లాస్ లో ప్రవేశ నోటీస్
తొర్రూరు జూన్ 16:స్పోర్ట్స్ స్కూల్లో 4వ క్లాస్ లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని తొర్రూరు ఏం ఈ ఓ ఏం బుచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం వివరాలు వెల్లడిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ వారి యొక్క ఆదేశానుసారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో హకీంపేట కరీంనగర్ ,అదిలాబాద్ జిల్లాలోని స్పోర్ట్స్ స్కూల్లో 4వ క్లాస్ లో అడ్మిషన్ కొరకు సెలక్షన్స్ నేడు 17 న రోజున జడ్పిహెచ్ఎస్ తొర్రూర్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించబడును .ఈ సెలక్షన్స్ కి వచ్చే విద్యార్థులు పర్సనల్ ఫోన్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోని ఉండాలి.tgss.telangana.gov.in e website లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నవాళ్లు 01/09/2016 మరియు 31/08/2017 మధ్య జన్మించి ఉన్న వారు మాత్రమే అర్హులు అని చెప్పారు.