logo

విశాఖ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వంకర ఆనంద కుమార్

విశాఖ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వంకర ఆనంద కుమార్ నియమితు లయ్యారు ఈ మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారి చేశారు కాంగ్రెస్ పార్టీ నగరఅధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజు చేతుల మీదుగా ఆనంద కుమార్ నియామక పత్రం స్వీకరించారు అలాగే సంయుక్త కార్యదర్శిగా కొండపల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ 49వ వార్డు ప్రెసిడెంట్ గా ఉన్న తనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ కి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డాల వర్మ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా తనకు ఇచ్చిన ఈ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

సంయుక్త కార్య దర్శిగా నియమితులైన కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందుగా పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిలకు మరియు విశాఖ జిల్లా అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
నగర కాంగ్రెస్ కమిటీలో స్థానం కల్పించినందుకు పార్టీ నాయకుల ఆదేశానుసారం పార్టీ అభివృద్ధికి తన వంతు బాధ్యతను నెరవేరుస్తానని ఆయన తెలిపారు.

ఈ కార్య క్రమంలో డీసీసీ అధ్యక్షులు ఏ వీ వర్మ రాజు తో నియోజక వర్గ సమన్వయ కర్తలు కే వీ సూర్యనారాయణ ,సవరవిల్లి రామ కృష్ణ ,వైస్ ప్రెసిడెంట్లు మధుసూదన రావు కస్తూరి వెంకట రావు,భుకారి మహమ్మద్,మహిళా
నాయకులు,వార్డు ప్రెసిడెంట్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

11
1027 views