logo

పోలీస్ శాఖ లో ఎస్ఐల బదిలీలు

జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో ఎస్ఐల బదిలీలు

జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో కొంతమంది సబ్ ఇన్‌స్పెక్టర్ల (సివిల్) బదిలీలు చేపట్టినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జోన్-2 బాసర డీఐజీ ఆదేశాల మేరకు ఈ బదిలీలు అమలులోకి వచ్చాయి.

ఈ మేరకు మొత్తం ఎనిమిది మంది ఎస్ఐల బదిలీలు జరిగాయి. వీరిలో జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్లకు చెందినవారు ఉన్నారు.

బదిలీ అయిన వారు:

పి. గీతా : జగిత్యాల టౌన్ PS నుంచి సారంగాపూర్ PS కి.

పి. ఉదయ్ కుమార్ : ధర్మపురి PS నుంచి వెల్గటూర్ PS కి.

ఎస్. శ్రీకాంత్ : కోరుట్ల PS నుంచి DSB, జగిత్యాల కి.

పి. దత్తాత్రి : సారంగాపూర్ PS నుంచి DCRB, జగిత్యాల కి.

సిహెచ్. సతీష్ : గొల్లపల్లి PS నుంచి DSB, జగిత్యాల కి.

ఆర్. ఉమాశంకర్ : వెల్గటూర్ PS నుంచి VR, జగిత్యాల కి.

ఎం. చిరంజీవి : నిజామాబాద్ కమిషనరేట్ నందిపేట PS నుంచి కోరుట్ల PS కి.
ఎం. కృష్ణసాగర్ రెడ్డి : నిర్మల్ జిల్లా కడం PS నుంచి గొల్లపల్లి PS కి. బదిలీ అయినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

36
2497 views