logo

ఇజ్రాయెల్ పై బాహుబలి మిసైల్ 'కోరమ్ షహర్' ను ప్రయోగించిన ఇరాన్.. ఊహకందని విధ్వంసం....

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఈ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా ప్రవేశించింది. ఇరాన్‌ కు చెందిన 3 ప్రధాన అణు స్థావరాలపై అమెరికా దాడి చేసింది. ఇరాన్‌ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్‌ అణు కేంద్రాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఇరాన్ కు చెందిన ప్రతిష్టాత్మక మిసైల్ గా భావించే కోరమ్ షహర్-4 ను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది....

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రత్యక్షంగా అమెరికా పాల్గొనడంపై ఇరాన్ లో ఆగ్రహ జ్వాలలు అలుముకున్నాయి. ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్‌ అణు కేంద్రాలపై దాడి చేసిన అమెరికా.. వాటిని ధ్వంసం చేయడంతో ఇజ్రాయెల్ పై భీకర స్థాయిలో విరుచుకు పడింది ఇరాన్. ఈ క్రమంలో బాహుబలి మిసైల్ గా పేరొందిన కోరమ్ షహర్-4 మిసైల్ ను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది ఇరాన్....

ఇరాన్ వద్ద ప్రస్తుతం ఉన్న క్షిపణుల్లో అత్యంత శక్తివంతమైనదిగా కోరమ్ షహర్-4 కు పేరుంది. ఈ మిసైల్ ను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది ఇరాన్. అంతేకాక మరో 40 మిసైల్స్ ను ఏకధాటిగా ఇజ్రాయెల్ లోని పలు కీలక స్థావరాలపై ప్రయోగించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్టు, లాజిస్టిక్స్ హబ్స్, కమాండ్ కంట్రోల్ భవనాలు నేలమట్టం అయినట్లు తెలిపింది....

ఈ మిసైల్ ను ఇరాన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ రూపొందించింది. ఇది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. 2017, 2019 లో జరిగిన ఇరాన్ మిలిటరీ పరేడ్ లో వీటిని తొలిసారిగా ప్రదర్శించారు. దీని స్పీడు మ్యాక్ 18 గా ఉంది. 1800 కిలోల పే లోడ్ ను ఈ మిసైల్ మోసుకెళ్ల గలదు. దాదాపు 2000 కిలోమీటర్ల వరకు ఈ మిసైల్ దాడులను చేయవచ్చు....

https://share.google/rfsHNeLpXjWfh2BZG

24
1568 views