logo

నగరి పోలీస్ స్టేషన్ పరిధి లో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్, 2 కేజీ ల గంజాయి మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం ...యన్. విక్రమ్, ఇన్స్పెక్టర్ నగరి.


నగరి పోలీస్ స్టేషన్ పరిధి లో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్, 2 కేజీ ల గంజాయి మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం ...యన్. విక్రమ్, ఇన్స్పెక్టర్ నగరి.

చిత్తూరు జిల్లా యస్.పి మణికంఠ చందోలు, ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు, నగరి సబ్-డివిజన్ పరిధి లో డి.యస్.పి సయ్యద్ మహమ్మద్ అజీజ్ స్వీయ పర్యవేక్షణం లో గంజాయి అక్రమ రవాణా, అమ్మడం, కొనడం, సేవించడం పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మరియు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా ఈ రోజు 25 జూన్ 2025 బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నగరి ఇన్స్పెక్టర్ యన్. విక్రమ్ కి రాబడిన సమాచారం మేరకు, మండల డిప్యూటీ తహశీల్దారు మేఘవర్ణం , రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది తో పాటు నగరి-తిరుత్తణి మెయిన్ రోడ్డు కి ఆనుకొని వున్న వి. కె. ఆర్. పురం వద్ద మోటార్ సైకిల్ పెట్టుకొని గంజాయి అమ్ముతున్న తమిళనాడు రాష్ట్రం కాంచీపురం కు చెందిన కే. ప్రేమ కుమార్ అను ప్రేమ్ అను వ్యక్తి ని అదుపులోకి తీసుకొని విచారించి, అతని వద్ద నుండి 2 కేజీ ల గంజాయి దాని విలువ సుమారు 32,000/, ఒక మోటార్ సైకిల్ వాహనం, ఒక మొబైలు ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. పై వ్యక్తి తిరుత్తణి లో ఒక వ్యక్తి వద్ద నుండి గంజాయి ని తీసుకొని వచ్చి నగరి పరిసర ప్రాంతాలలో గంజాయి రవాణా మరియు అమ్ముతున్నట్లు గుర్తించడం జరిగింది. అతనిని కూడా త్వరలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. వీరిని పట్టుకోవడం లో ప్రతిభ చూపిన సిబ్బంది గజేంద్ర, లోకనాధం, రమేష్, సత్య, అశోక్ మరియు గణేష్ లను అభినందించడం జరిగింది.
విద్యార్థులు మరియు యువత గంజాయి బారిన పడి జీవితాన్ని పాడుచేసుకోకుండా సామాజిక భాద్యతగా, గంజాయి రవాణా, కలిగి వుండటం, అమ్మడం, సేవించడం మొదలగు విషయాలను ప్రజలు పోలీస్ వారికి తెలియజేసి గంజాయి నిర్మూలనకు సహకరించ వలసిందిగా కోరడమైనది.
అరెస్ట్ కాబడిన వ్యక్తి వివరాలు:
కే. ప్రేమ కుమార్ @ ప్రేమ్, వయస్సు: 26 సం. లు, తండ్రి: కన్నియప్పన్, డోర్ నెంబర్.41, కామరాజనగర్, కాంచీపురం తాలుకా & జిల్లా, తమిళనాడు రాష్ట్రం

5
518 views