YSRCP పార్టీ సింగనమల నియోజకవర్గం SC సెల్ అధ్యక్షుడిగా మంత్రి ఆంజి
యస్.టి.డి న్యూస్: సింగనమల అసెంబ్లీ నియోజకవర్గ SC సెల్ అధ్యక్షుడిగా మంత్రి ఆంజనేయులుని నియమించారు. ఈ మేరకు YCP అధినేత YS జగన్మోహన్ రెడ్డి నియామక ఉత్తర్వులు అందజేశారు. మంత్రి ఆంజనేయులు మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గములో YCP పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన YCP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డికి, సింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు.