logo

దేశపాత్రునిపాలెం పంచాయతీ మంగళ పాలెం సాయినగర్ ఎంపీపీ స్కూల్ పిల్లలకు బాలల సాంస్కృతిక విభాగంలో పురస్పురస్కారాలు సన్మానం

తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల బాలల సాంస్కృతిక పురస్కారాలు సినీ నటులు బాల ఆదిత్య విజేతలకు అందజేయడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం విజయనగరం నుండి ముగ్గురు పిల్లలు సెలెక్ట్ చేయడం జరిగింది. కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం పంచాయితీ మంగళపాలెం సాయి నగర్ కాలనీ ఎం పీ పీ స్కూల్ చదువుతున్న విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించడం జరిగింది. ఐదో తరగతి చదువుతున్న లలితా లాస్య లహరిక డ్రాయింగ్ కాంపిటేషన్లో మొదటి బహుమతి సాధించింది .మూడో తరగతి చదువుతున్న ఏలూరి లలితా శ్రావణి కూచిపూడి జూనియర్స్ ప్రథమ స్థానంలో విజేత సాధించింది. మరొకరు పీఎం పాలెం సృజన స్కూల్లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి శివ కార్తికేయకు ద్వితీయ స్థానంలో డ్రాయింగ్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది. వీరిని ప్రత్యేకంగా ఎక్స్ ఎమ్మెల్యే కడుబంటి శ్రీనివాస్ గారు ఈరోజు తన క్యాంప్ ఆఫీసులో ఘనంగా సత్కరించడం జరిగింది. ఇలాంటివారు ఎంతో ఆదర్శప్రాయం అని ఇలాంటి వారికి సపోర్ట్ చేయాలని మరిన్ని బహుమతులు సాధించాలని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అలాగే దేశపాత్రునిపాలెం పంచాయితీ గ్రామ పెద్దల సమక్షంలో రామాలయం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఏలూరు వెంకటరమణమూర్తి శర్మ గారిని వారి సతీమణిని కూడా నంది అవార్డు వచ్చినందుకు సందర్భంగా వారి దంపతులకు కూడా సత్కారాన్ని అందించడం జరిగింది. వీరికి నా చేతుల మీదుగా సత్కరించడం ఎంతో ఆనందకరమని ఎక్స్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా సత్కరించేందుకు పిల్లలు కూడా ఆనందపడటం జరిగింది.

59
5976 views