logo

మల్యాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం*


*మల్యాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం*

*నంద్యాల/నందికొట్కూరు, జూలై, 17 :-*

*నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు జలాలకు జలహారతి, నీటి సంఘాల ప్రతినిధులు, రైతులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుండి అల్లూరు మండలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్ఎండి.ఫరూక్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి.జనార్ధన్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, నందికొట్కూరు, పాణ్యం, ఆళ్లగడ్డ, గుంతకల్లు శాసనసభ్యులు గిత్త జయసూర్య, గౌరుచరిత భూమా అఖిలప్రియ, గుమ్మనూరు జయరాం, నంద్యాల పార్లమెంటు టిడిపి ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి, పార్టీ నాయకులు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.*

*అనంతరం హెలిప్యాడ్ నుండి మల్యాల లో హంద్రీనీవా సుజల స్రవంతి పంపింగ్ స్టేషన్ నుంచి నీటి విడుదల, కృష్ణా జలాలకు జలహారతి కార్యక్రమం, నీటి సంఘాల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించే ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు.*

*కార్యక్రమాలను ముగించుకొని తిరిగి సాయంత్రం అల్లూరు హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, డిఐజి ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, శాసనసభ్యులు జయసూర్య, బుడ్డా రాజశేఖరరెడ్డి, నంద్యాల పార్లమెంటు టిడిపి ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి తదితరులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.*

1
0 views