logo

🌹 *ఇదేనా మనం* సమర్థతకు సమర్థన లభించక, నిస్సహాయంగా నీరసించి పోతువుంటే, అసమర్ధత అందలమెక్కి అధికారం చెలాయిస్తుంటే,

🌹 *ఇదేనా మనం*

సమర్థతకు సమర్థన లభించక,
నిస్సహాయంగా నీరసించి పోతువుంటే,
అసమర్ధత అందలమెక్కి అధికారం చెలాయిస్తుంటే,
దానికి, అవినీతి, ఆశ్రిత పక్షపాతం అనే వ్యాధులు, అంటుకుని అతుక్కుపోతే,
ఆరోగ్యకరమైన సమాజాన్ని ఎలా నిర్మించగలుగుతాం?

సిద్ధాంతాల రాద్దాంతాలతో జీవిస్తూ, ఉపన్యాసాలు చెప్తూ, పుస్తకాలు రాస్తూ, సమాజాన్ని సంస్కరించగలుగుతామా.
అది కేవలం స్వయం సంతృప్తి కోసం.
మన వీపు మనమే "సెహ్బష్" అంటూ చరచు కోవడం.

అప్పుడెప్పుడో ఎవడో వందల ఏళ్ల క్రితం కట్టినవి, ఇంకా నిలబడి సేవ చేస్తున్నవి.
మొన్న , నిన్న కట్టినవి, నేడు ఇంకా కడుతూనే వున్నవి కూలిపోతున్నవి.
ఆ శిథిలాల క్రింద మరణాలు పాలకులు చేసిన హత్యలే కదా.

ఒక్కరి మరణానికి కారణం ఐతే నేరం,
ఎక్కువ మంది ఛస్తే పాలన అవుతుందా?

ప్రజల్ని, ఫరా ఫరా కోస్తాం అన్నవాడిని, గుండా చట్టం క్రింద జైలు గూట్లో మూసేయ్యలేక పోవడం,
ఎటువంటి బలహీనత.

వో నలుగురు నడుచుకుంటూ వచ్చి, జనాన్ని గంప గుత్తగా కాల్చి చంపి, నిదానంగా నడుచుకుంటూ, వెళ్ళి పోతే,
వాళ్ళని పట్టుకోవడం ఇప్పటికీ చేతకాని పాలకుల సమర్ధత ప్రశ్నార్థకం కదా.
వాళ్ళని నమ్మి , ధైర్యంగా బ్రతకొచ్చా?
ప్రజలకు, అసలు రక్షణ ఇవ్వలేని రాజ్యం లో, జీవించేది ఎలా?

ఊపిరి తిరగని ఉపన్యాసాలు,
మతోద్రేకాల మోసాలు,
కులాలకు పందేరాలు,
ఆశ్రితులకు అందలాలు,

ఏమున్నది ఈ సమాజంలో,
సమర్ధుడు సంతోషంగా, సంతృప్తిగా, క్షేమంగా, జీవించడానికి?

బొక్కలు ఏరుకునే పాలనలో,
ప్రజల బ్రతుకులు, కుక్కలు చింపిన విస్తర్లే కదా.... SHAIK MADHAR

0
76 views