
కక్ష సాధింపు చర్యలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసింది.
కక్ష సాధింపు చర్యలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసింది.
చిత్తూరు జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి.
చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దాయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని అన్యాయంగా కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసులో ఇరికించిందని, దీనికి ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయని బుధవారం బంగారుపాలెం లో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ లో కిషోర్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన మిథున్ రెడ్డి మచ్చలేని నాయకుడిగా తిరిగి వస్తారని కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, బలమైన నాయకున్ని అరెస్టు చేస్తే కార్యకర్తలను అణచివేసినట్లని భావిస్తున్నారని, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కూడా అరెస్టు చేస్తామని చెప్పడం పట్ల ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి విలువ లేకుండా పోయిందని, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన 14 నెలలు కావస్తున్న రెడ్బుక్ రాజ్యాంగాన్ని లోకేష్ అమలు చేస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమాలను గాలికి వదిలేసారని కిషోర్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలా చేసే కొద్ది వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రజల మద్దతు బలంగా ఉందని పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టిన, భయపెట్టిన ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరని మరోసారి కిషోర్ కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. ఎంతమందిని అరెస్టు చేసిన నాలుగేళ్ల పాలన తర్వాత దీనికి భిన్నంగా ఉంటుందని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.