logo

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కి మాతృవియోగం...*

*నాగర్ కర్నూల్ జిల్లా.....*

*నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కి మాతృవియోగం...*

*గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి...*

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాతృమూర్తి బాదావత్ శాంతమ్మ (51) బుధవారం వారి వారి స్వగ్రామం వరంగల్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాంతమ్మ బుధవారం అర్ధరాత్రి తరువాత చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జిల్లా కలెక్టర్ తల్లి ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులు తెలియజేయడంతో కలెక్టర్ సంతోష్ హుటాహుటిన వరంగల్ బయలుదేరారు.
తన తల్లి చికిత్స పొందుతున్న వరంగల్ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతి చెందిన బాదావత్ శాంతమ్మకు
భర్త బాదావత్ హరిలాల్, ముగ్గురు కుమారులు ఉండగా
..వారిలో పెద్ద కుమారుడు నాగర్ కర్నూల్ కలెక్టర్ పనిచేస్తున్న బాదావత్ సంతోష్, రెండో కుమారుడు బాదావత్ తిరుపతయ్య, మూడవ కుమారుడు బాదావత్ బాలరాజులు ఉన్నారు.
*కలెక్టర్ మాతృమూర్తి కి జిల్లా అధికారులు , పాత్రికేయులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.*

8
607 views