logo

రోలుగుంటలో భారతదేశ గ్రంథాలయ పితామహుని జయంతి ఉత్సవాలు

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట శాఖ గ్రంథాలయంలో భారతదేశ గ్రంధాల పితామహుడు అయినటువంటి" అయ్యంకి రమణయ్య (జయంతి సందర్భంగా) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు రోలుగుంట మండల విద్యాశాఖ అధికారి వారు2 శెట్టి మోహన్ రావు హాజరైనారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ పితామహుడు అయినటువంటి అయ్యంకి వెంకటరమణ జీవిత చరిత్రను తెలియజేశారు. మరియు విద్యార్థులందరూ గ్రంధాలయ సేవలను ఉపయోగించుకొని., భవిష్యత్తులో మంచి ప్రయోజకులు కావాలని కోరారు.
రోలుగుంట హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు టీ.వి. శేషగిరిరావు ముఖ్యఅతిథిగా హాజరైనారు
ప్రధానోపాధ్యాయులు పుస్తక పఠనం యొక్క ఆవశ్యకతను వివరించి., ప్రతి ఒక్కరూ కూడా మంచి పుస్తకం కొనుక్కొని చదవాలని., ఒక పుస్తకం వెయ్యి మంది స్నేహితులతో సమానమని ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తులందరూ కూడా పుస్తక పఠనం వలన అభివృద్ధి చెందాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రోలుగుంట కాంప్లెక్స్ సి.ఆర్.పి పి.సతీష్ . గ్రంధాలయ ఉద్యమ పితామహుడు గురించి వివరించి., గ్రంథాలయ సూత్రాలను వివరించారు. అందరూ సమాజంలో మంచి అభివృద్ధిని తీసుకురావాలంటే గ్రంథాలయ యొక్క పాత్రను గ్రహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుసర్లపూడి సి ఆర్పి కే. చిరంజీవి గారు., పాఠశాల విద్యార్థులు., పౌరులు. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమము నకు స్థానిక రోలుగుంట సహాయగ్రంధాలయ అధికారి ఎన్ రాజబాబు అధ్యక్షత వహించి., విజయంతంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచారు

20
996 views