logo

పవర్‌లిఫ్టర్, క్రీడాజ్యోతి పి.వి.ఎం. నాగజ్యోతి మరోసారి మెరిసారు

జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో బంగారు పతకాలు గెలుచుకున్న పవర్‌లిఫ్టర్, క్రీడాజ్యోతి పి.వి.ఎం. నాగజ్యోతి మరోసారి మెరిసారు.
విద్యార్థులకు బోధనతో పాటు క్రీడారంగానికి కూడా సమానంగా అంకితమైన ఉపాధ్యాయురాలు పి.వి.ఎం. నాగజ్యోతి జూలై 26,27వ తేదీలలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, రేవేంద్రపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమరావతి పవర్‌లిఫ్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు.ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుండి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలు సబ్-జూనియర్, జూనియర్ మరియు మాస్టర్స్ విభాగాల్లో నిర్వహించబడ్డాయి. నాగజ్యోతి గారు 74 కిలోల మాస్టర్స్ విభాగంలో స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ విభాగాలలో అద్భుత ప్రదర్శన కనబరిచి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు.ఇప్పటివరకు ఆమె అనేక జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో బంగారు పతకాలను సాధించి రాష్ట్రానికి, దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చారు. ప్రతి విజయానికి వెనుక ఉన్న ఆమె కృషి, పట్టుదల, అంకితభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ "విద్యార్థులకు ప్రేరణ కలిగించాలంటే ఉపాధ్యాయులుగా మనమే ముందు లక్ష్యాన్ని నిర్దేశించుకొని కృషి చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకు ఇప్పుడు మరింత ప్రాధాన్యత లభిస్తోంది. ప్రతి ఒక్కరికీ శారీరక దారుఢ్యం కోసం క్రీడలు అవసరమని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అందుకే ఈ రంగంలో నా ప్రయాణం కొనసాగుతోంది" అని అన్నారు.ఆమె విజయంతో ఉపాధ్యాయ వృత్తికి గౌరవం చేకూరినది. యువతలో స్పూర్తిని నింపిన ఆమెకు పాఠశాల, గ్రామస్థులు, క్రీడాభిమానులు నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథులు గాకాసరనేని జస్వంత్, AMC డైరెక్టర్, దుగ్గిరాల
కె. మధుబాబు, MPTC లు విచ్చేసి బహుమతి ప్రదానం చేశారు.

31
6509 views