logo

కీర్తిశేషులు కాసు బ్రహ్మానంద రెడ్డిగారి జయంత్యుత్సవం.

ది 28-07-2025:ఈ రోజు స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని, జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న, ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలవేసి, పుష్పాంజలి తో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . ఈ సందర్భంగా శేర్లింగంపల్లి పురపాలక సంఘ మాజీ ఫ్లోర్ లీడర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుడిగా, అవిభక్త మద్రాసు శాసనసభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా,ముఖ్యమంత్రిగా, (సుమారు ఏడున్నార సంవత్సరములు) సెంట్రల్ ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా, కేంద్ర టెలి కమ్యూనికేషన్, అగ్రికల్చరల్, హోం శాఖ మాత్యులు గా, సమర్థవంతమైన సేవలు అందించారు. ఏఐసీసీ అధ్యక్షులుగా,మహారాష్ట్ర గవర్నర్గా, ఈ దేశానికి వారు ఎనలేని సేవలు అందించారు. పదవీకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయ పురోభివృద్ధికి, విశేషమైన కృషిసలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, కేంద్ర ప్రభుత్వ 135 సంస్థలను ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పే విధంగా కృషి చేశారు అని పేర్కొన్నారు.ఆయన మంచి పరిపాలన దక్షుడు అని, ధైర్యశాలి అని కొనియాడారు. పనిచేసే ముఖ్యమంత్రులలో మొదటి వరుసలో ఉండదగినవాడుగా శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పేరుగాంచారు అని తెలిపారు. ఆయన జీవితం ఆదర్శంగా తీసుకొని నీటి నేటి యువ రాజకీయ నాయకులు రాష్ట్ర హక్కులకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

34
702 views