logo

గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించిన విద్యార్థి సంఘల నాయకులు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు.. ముఖ్యంగా గిరిజన, గురుకుల పాఠశాలలా పరిస్థితి దారుణంగా తయారయింది. ఆహారం బాగోలేదంటూ ఏదో ఒక పాఠశాలలో నిరసనలు జరుగుతూనే ఉంటున్నాయి. పురుగుల పట్టిన అన్నం తిని ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రులలో కూడా జాయిన్ అవుతున్నా వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకుంటుందని, శాశ్వత పరిష్కారం వైపు ఆలోచించడం లేదంటూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU ), మరియు తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP) నాయకులు విమర్శించారు. నసుర్లలాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల వసతులను పిడిఎసు జిల్లా అధ్యక్షులు ఎన్ బాల్రాజ్, మరియు టీ ఎస్ పి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ విద్యార్థి సంఘా నాయకులు పాఠశాలను పరిశీలించరు విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని ప్రతిరోజు అందించాలని విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీ పడదని నాణ్యమైన భోజనాన్ని అందించాలని పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించేటట్లుగా ముక్యంగా సీజనల్ వ్యాధులు గురించి విద్యార్థులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంతోపాటు మంత్లీ హెల్త్ చెకప్ చేయించాలని అందేవిధంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని,రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు వరుసగా చోటు చేసుకొంటున్నాయని పాఠశాల యాజమాన్యానికి సూచించారు స్థానిక వైద్య సిబ్బంది విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని తెలియజేశారు. గిరిజన పాఠశాలలో విద్య ప్రమాణాన్ని పెంచాలని ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని విద్యార్థులకు చదువుతోపాటు మానసిక క్రీడలను ప్రోత్సహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పి డి ఎస్ యు (ఎస్) నాయకులు N సాయిబాబా, R ప్రశాంత్, టిఎస్పి నాయకులు G ఆదర్శ్ కుమార్ గురుకుల పాఠశాల యెక్క విద్యార్థులు మరియు ప్రిన్సిపాల్ మాధవరావు, వసతి గృహాధికారిని రాధా మేడం పాల్గొన్నారు.

0
19 views