logo

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు,

తేదీ 31 జూలై 2025
బాన్సువాడ పట్టణం

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులతో పారిశుద్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు

సమావేశంలో వార్డు అధికారులతో మాట్లాడుతూ వార్డులలో డ్రైనేజీ వ్యవస్థలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం.

ఇది మురికి, వ్యర్థాలు మరియు ఇతర అడ్డంకులు పేరుకుపోకుండా నిరోధిస్తుంది

తద్వారా అధిక వర్షపాతం ద్వారా వచ్చే నీరు సాఫీగా ప్రవహించేలా చేస్తుంది.

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకొనే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ కమిషనర్,వార్డు అధికారులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

0
426 views