logo

మాజీ సైనికుని కోటాలో తన కేటాయించిన భూమిలో అర ఎకరా స్థలం కేటాయించాలని ప్రత్యర్థులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, మాజీ సైనికుడు సుధీర్

తవణంపల్లి మండలం. మాజీ సైనికుని కోటాలో తన కేటాయించిన భూమిలో అర ఎకరా స్థలం కేటాయించాలని ప్రత్యర్థులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, మాజీ సైనికుడు సుధీర్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 2023లో మాజీ సైనికుని కోటా కింద తవణంపల్లి మండలంలో తనకు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని, 2025 లో పొజిషన్ సర్టిఫికెట్, పట్టా కోసం జెసి దృష్టికి తీసుకువెళ్లగా తాసిల్దార్ సర్వే చేసి తనకు స్థలాన్ని కేటాయించడం జరిగింది అన్నారు. కానీ ప్రత్యర్థులు తన స్థలంలో అర ఎకరా స్థలం కావాలని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఇదే విషయాన్ని జెసి ,తాసిల్దార్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. కానీ తాసిల్దార్ ప్రత్యర్థులతో కలిసి వచ్చి తన పొలం నుండి అర ఎకరా ప్రత్యర్థులకు కేటాయించాలని, కొండపైన మరింత స్థలాన్ని చదును చేసుకోమని చెప్పడం బాధాకరం అన్నారు.

0
138 views