
పుత్తూరు విద్యార్థులకు జిల్లా స్థాయిలో ప్రధమస్థానం...
పుత్తూరు విద్యార్థులకు జిల్లా స్థాయిలో ప్రధమస్థానం...
ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో పివికేఎన్ డిగ్రీ కళాశాలలో జరిగినటువంటి జిల్లా స్థాయి పోటీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పుత్తూరు విద్యార్థినులకు ప్రథమ స్థానం లభించింది. సమాచార హక్కు చట్టం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం చిత్తూరు పివికేఎన్ కళాశాలలో జరిగిన పోటీలలో పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో బి బి ఏ తృతీయ సంవత్సరం చదువుతున్న పూజారి లావణ్య కు వ్యాసరచనలో ప్రథమ స్థానం, బీకాం (సి. ఏ) తృతీయ సంవత్సరం చదువుతున్న టీ.వరలక్ష్మికి ఉపన్యాసం పోటీలో ప్రథమ స్థానం లభించింది..
ఈ సందర్భంగా శుక్రవారం కళాశాలలో జరిగిన అభినందన సభలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాలకు, పరీక్షలకే పరిమితం కాకుండా అన్ని రకాల పోటీలలో పాల్గొన్నప్పుడే సర్వతోముఖాభివృద్ధి కలుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రథమ స్థానం పొందినటువంటి విద్యార్థులు వచ్చే వారంలో కడపలో జరిగేటటువంటి జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు..
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కోటేశ్వరయ్య, డాక్టర్ మన్యం నరసింహులు, డాక్టర్ ఏ. దేవకి,డాక్టర్ పి. వెంకటేశన్, డాక్టర్ జి.గంగయ్య,డాక్టర్ జి. తిరుమలయ్య, శ్రీమతి కే.సావిత్రి పాల్గొన్నారు