మచిలీపట్నం: దేశాయిపేటలో 7 కొత్త స్పౌస్ పెన్షన్లు పంపిణీ
మచిలీపట్నం: దేశాయిపేటలో 7 కొత్త స్పౌస్ పెన్షన్లు పంపిణీ
మచిలీపట్నం, ఆగస్టు 3 : దేశాయిపేట 32వ డివిజన్‌లో నూతనంగా మంజూరైన 7 స్పౌస్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ ఇంచార్జ్ నారగని కృష్ణ, యూనిట్ ఇంచార్జ్ గుణ్ణం నాగబాబు, 36వ డివిజన్ ఇంచార్జ్ కోడాలి అంజయ్య పాల్గొన్నారు.
తెలుగు యువత నాయకులు వాక కొండ, బొర్రా బ్రహ్మం, నారగని మధు, బొర్రా హర్షిత్, నారగని పండు, నారగని నాగు, మూరల వంశీలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పెన్షన్ల మంజూరుకు కృషి చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, డివిజన్ ఇంచార్జ్ నారగని కృష్ణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ – “ఇది మంచి ప్రభుత్వం. ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా పాలన కొనసాగాలని ఆశిస్తున్నాం” అని ఆనందం వ్యక్తం చేశారు.