మోడిఫైడ్ సైలెన్సర్లపై ప్రత్యేక డ్రైవ్
మచిలీపట్నం (వార్త బలం ప్రతినిధి):బందరు ట్రాఫిక్ సీఐ నున్న రాజు పర్యవేక్షణలో మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద మోడిఫైడ్ సైలెన్సర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ తనిఖీల్లో అనధికారికంగా మార్పులు చేసిన ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు గుర్తించి తొలగించడమే కాక, వాటిని ఉపయోగించిన వాహనదారులపై జరిమానాలు విధించారు. రోడ్లపై శబ్ద కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజలకు భద్రత కల్పించేందుకు ఇటువంటి డ్రైవులు కొనసాగుతాయని సీఐ పేర్కొన్నారు.