logo

సెల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొరకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరయిన అచ్చంపేట ఎమ్మేల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ


అచ్చంపేట, ఆగష్టు 04,:జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ల ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ముందువిచారణకుహాజరైనఅచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ల ట్యాపింగ్ కేసు లో... ఫోన్ ట్యాపింగ్ కు గురైన ఎమ్మెల్యేడా.వంశీకృష్ణ సిట్ ముందు సోమవారం హాజరై వాంగ్మూలంఇచ్చారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంరాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతలు, నాయకులపై ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం జరిగింది.ఫోన్ ట్యాపింగ్,వ్యవహారంలోనిజానిజాలపై స్పష్టతరాబట్టేందుకు సిట్ అడుగులు వేగంగాకొనసాగుతుంది. ఫోన్ ట్యా పింగ్ కేసుతీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యేమాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులోసిట్,అధికారులదర్యాప్తు ను అభినందిస్తూ త్వరగా ఈ కేసులో నిజా నిజాలు బయటికి రావాలని దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.

11
2027 views