logo

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ పార్టీకి గుడ్ బై చెప్పిన గువ్వల బాలరాజు ఈ నెల 9న బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా గుడ్ బై చెప్పనున్నారని సమాచారం



అచ్చంపేట, ఆగస్టు 04, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా,అచ్చంపేట, బీఆర్ఎస్ పార్టీ కి తగిలిన మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకుతనరాజీనామాలేఖనుబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపారు. పార్టీపైఅసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే, 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి రెండుసార్లుఎమ్మెల్యేగాగెలుపొందారు. మొదటినుండి దూకుడు స్వభావ మున్న గువ్వల బాలరాజుమొ యినాబాద్ ఫామ్ హౌస్,వ్యవహారంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో నామమాత్రంగా పాల్గొంటూ వచ్చిన ఆయనఅధిష్ఠానంతోనఅంటీముట్టనట్లుగాఉంటున్నారు. కొన్ని రోజులుగా బీజేపీ నేతలతో టచ్,ఉన్నబాలరాజు.. ఈ నెల 9వ తేదీన కమలం గూటికిచేరనున్నారనిసమాచారం కాగా, బాలరాజుతో పాటుగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. బీ ఆర్ ఎస్ పార్టీ ని బీజేపి లో విలీనం చేస్తారనే ఊహా గానాలువినిపిస్తున్నాయి.అందుకే అందరి కన్నా ముందే బీజేపీలో విలీనానికిముందే చేరిపోతారని ఆడియో వైరల్ అవుతుంది బీఆర్ఎస్కు రాజీనామా అనంతరం కార్యకర్త తో ఫోన్లో మాట్లాడిన మాజీ ఎమ్మె ల్యే గువ్వల బాలరాజుకు సంబంధించి ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.'బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు.. వీళ్ల కంటే ముందే బీజేపీలోచేరిపోతానని అన్నారు. ఏ పార్టీ లో చేరినా నాతో పాటు పని చేసిన కార్యకర్తల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి సహాయం చేస్తూ మరిచిపోకుండా పునాదులు వేసి వారికి చేదోడు వాదోడుగా అటు ప్రజలకూ, ఇటు కార్యకర్తల కూ ప్రజా సేవల విషయం లో అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

27
3506 views